Header Banner

Pawan kalyan: ఇదో గేమ్ ఛేంజర్.. వారికి చాలా అనుకూలం.. డిప్యూటీ సీఎం ట్వీట్!

  Wed Jun 18, 2025 16:07        Politics

జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు ఉపశమనం కలిగించేలా ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్ల వ్యవస్థను ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) ప్రకటించడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) హర్షం వ్యక్తం చేశారు. భారత రహదారి మౌలిక సదుపాయాల ప్రస్థానంలో దీన్నో గేమ్ ఛేంజర్ ఆయన అభివర్ణించారు. ఈ మేరకు 'ఎక్స్'లో పోస్టు పెట్టారు. ఈ నిర్ణయంతో ఫాస్టాగ్ వార్షిక పాస్ తీసుకురావాలన్న ప్రయాణికుల దీర్ఘకాలిక డిమాండ్కు పరిష్కారం లభించినట్లవుతుందని పేర్కొన్నారు. టోల్ చెల్లింపులను సరళీకృతం చేస్తూ.. ప్రయాణ ఖర్చులను గణనీయంగా తగ్గించడం ద్వారా ప్రైవేటు వాహన యజమానులకు ఉపశమనం కలిగించేలా ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్లను అమలులోకి తీసుకొస్తున్నందుకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. రూ.3వేల వార్షిక పాస్తో వాహనదారులకు ఆర్థిక ఉపశమనం కలగడం మాత్రమే కాదు..

 

ఇది కూడా చదవండి: Amaravati: అమరావతిలో జాబ్ మేళా.. 5 సంస్థల్లో 400కిపైగా ఉద్యోగాల భర్తీ!

 

దేశ వ్యాప్తంగా సున్నితమైన, వేగవంతమైన, వివాద రహిత హైవే ప్రయాణం సాకారమవుతుందన్నారు. దీని ద్వారా టోల్ ప్లాజాల సమీపంలో నివసిస్తూ రెగ్యులర్గా ప్రయాణించే వారికి ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. వారికి సమయంతో పాటు భారం కూడా తగ్గుతుందన్నారు. ఈ నిర్ణయం నితిన్ గడ్కరీకి మోదీ సారథ్యంలోని ప్రజా పాలన పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్లను ఆగస్టు 15 నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించిన విషయం తెలిసిందే. రూ.3 వేలు చెల్లించి ఈ పాస్ తీసుకోవాల్సి ఉంటుందని ఆయన 'ఎక్స్'లో చేసిన పోస్టును పవన్ రీట్వీట్ చేస్తూ పైవిధంగా స్పందించారు. అయితే కార్లు, జీపులు, వ్యాన్లు వంటి నాన్- కమర్షియల్ వాహనాలకు వర్తించేలా కేంద్రం ప్రకటించిన ఈ పాస్కు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. పలు నిబంధనలు ఉండే అవకాశముంది.
 

ఇది కూడా చదవండి: Adabidda nidhi Scheme: ఏపీ మహిళలకు శుభవార్త.. నెలకు రూ. 1500పై కీలక అప్‌డేట్! ఈ పథకం త్వరలోనే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

Free bus: ఆడవాళ్ళకి అదిరిపోయే శుభవార్త... ఆగస్టు 15 నుంచి అమలు!

 

Pakistan: భారత్ పై యుద్ధం తప్ప మరో దారి లేదు.. పాకిస్థాన్ సంచలన వ్యాఖ్యలు!

 

Rythu Bharosa: రైతన్నలూ.. బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి! పంట పండించే ప్రతి ఎకరాకు!

 

Chandrababu warning Jagan: పులివెందుల రాజకీయం చేస్తే.. తోక కట్ చేస్తా! ఎవరు తప్పు చేసినా..

 

అధికారులు అలర్ట్.. చంద్రబాబు హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్యలు! విశాఖపట్నంలో సీఎం పర్యటన..

 

ఏసీబీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తతలు! మాజీ మంత్రికి మద్దతుగా వచ్చిన కార్యకర్తలు అరెస్ట్!

 

ఆ జిల్లా టమాటా రైతులపై ఊజీ ఈగ పిడుగు! దీంతో కొనేవారే..

 

సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్! FDలపై గరిష్ఠ వడ్డీ ఇస్తున్న బ్యాంకులు!

 

అసైన్డ్‌ భూములకు రెక్కలు.. ఈ డీల్‌తో రంగం.. ఆ జిల్లా కేంద్రంగా విశాఖ అధికారుల భేటీలు!

 

తల్లికి వందనం పడలేదా! పిల్లలు ఇప్పుడే ఫస్ట్ క్లాస్ కి వెళ్తున్నారా...అయితే ఇలా నమోదు చేసుకోండి!

 

ఆ రెండు దేశాలు చేస్తున్న హడావిడి చూస్తుంటే.. గోల్డ్ రేట్లు ఆకాశంలోకే! బంగారం రూ.3 లక్షలు..కారణం ఇదే!

 

ట్రంప్ ‘గోల్డ్ కార్డ్’ వెబ్‌సైట్‌: అమెరికా పౌరసత్వం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూద్దాం! అర్హతలివే!

 

సవాల్ చేస్తే సౌండ్ ఆఫ్! శరణమా, న్యాయ సమరమా తేల్చుకోవాలని జగన్‌కు సూచన!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Pawankalyan #AndhraPradesh #APpolitics #APNews #goodnews #Game Changer #Bharats Road #Infrastructure #Socialmedia